
బీజేపీని బలోపేతం చేద్దాం
● నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి
పెద్దపల్లిరూరల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన బీజేపీ సంస్థాగత సంరచన జిల్లాస్థాయి వర్క్‌షాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ జిల్లా సంస్థాగత సంరచన ప్రభారీ ఎర్రవెల్లి రఘునాథ్‌తో కలిసి సమావేశంలో మాట్లాడారు. ఓటర్లకు బీజేపీతో అనుబంధం పెంచేలా వ్యూహాత్మకంగా వ్యవహరించేలా కార్యకర్తలకు శిక్షణ ఇస్తోందన్నారు. సంస్థాగత పరిపక్వతను పెంచి ఓటర్లు బీజేపీ వైపు ఆకర్షితులయ్యేలా చూడాలని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నాయకులు కందుల సంధ్యారాణి, ఠాకూర్ రాంసింగ్, పర్శ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.