
యాసంగి ‘పంట పండింది’
● సమృద్ధిగా సాగునీరు ● అనుకూలించిన వాతావరణం ● ఫలితమిచ్చిన బ్రాహ్మణపల్లి ఎత్తిపోతల
రామగుండం: అంతర్గాం మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ యాసంగిలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగుచేశారు. ఇదేస్థాయిలో అధిక దిగుబడి సాధించారు. ఇందుకు ప్రధాన కారణం బ్రాహ్మణపల్లి ఎత్తిపోతల అందుబాటులోకి రావడమే. దీనిద్వారా ఎస్సారెస్పీ కాలువల చివరి ఆయకట్టు వరకూ సమృద్ధిగా సాగునీరు అందింది. పంటకు అవసరమైన నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంది. చీడపీడలు, తెగుళ్లు ఆశించలేదు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాయి.
ఏడు వేల క్వింటాళ్లు అదనం..
రైతులు ప్రతీ యాసంగిలో సాధించే ధాన్యం దిగుబడితో పోల్చితే ఈసారి సుమారు ఏడువేల క్వింటాళ్లు అదనంగా దిగుబడి సాధించారని అధికారులు అంచనా వేశారు. భారీగా తరలివచ్చిన ధాన్యంతో కొనుగోలు కేంద్రాల్లో స్థలం సరిపోలేదు. ప్రధాన రహదారికి ఇరువైపులా వడ్లు ఆరబెట్టుకునే పరిస్థితి వచ్చింది. మండలవ్యాప్తంగా ఇప్పటివరకు 13 కొనుగోలు కేంద్రాల్లో సుమారు 97 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు సొసైటీ చైర్మన్ ప్రభాకర్ తెలిపారు. గతేడాది ఇదే సీజన్‌తోలో 90వేల క్వింటాళ్లు సేకరించామని ఆయన పేర్కొన్నారు.

యాసంగి ‘పంట పండింది’