లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్‌కోడ్‌లతో మా హక్కులన్నీ పోతాయి. కార్మిక చట్టాలను యథాధావిధిగా ఉంచాలి. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. విద్య, వైద్యం అందజేయాలి. ఒకరోజు సమ్మెతో కేంద్రం దిగివస్తుంది. – రత్న శ్రీనివాస్, మెకానిక్, ఆర్‌ఎఫ్‌సీఎల్
కొత్త గనులు రావాలి
కొత్త బొగ్గుగనులు రావాలి. కొత్త ఉద్యోగాలు ఇవ్వావాలి. టెండర్లను రద్దు చేయాలి. కోల్‌బ్లాక్‌లను సింగరేణి సంస్థకే కేటాయించాలి. కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి. ఇందుకోసం ఈనెల 20న సమ్మె చేసుడే.
– బోగె సతీశ్‌బాబు,
జనరల్ అసిస్టెంట్, జీడీకే–5 ఓసీపీ
సమ్మెతోనే హక్కులు
సమ్మెతోనే కార్మికుల హక్కులు సాధ్యం. కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలి. లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించేలా కేంద్రప్రభుత్వం ఆదేశించాలి. సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తాం.
– చింతల అంజి,
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడు
లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి
లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి


