
సర్కార్ ఆస్పత్రిలో సకల సౌకర్యాలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో ఆధునిక వసతులతో కూడిన ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న 50 పడకలను 100 పడకలకు పెంచుతున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.51 కోట్ల వ్యయంతో నిర్మించే ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. వచ్చే 15 నెలల్లో భవన నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. ప్రతీరోజు సుమారు 800 మంది ఔట్ పేషెంట్లు వైద్యసేవలు పొందుతున్నారని, పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే టిఫా స్కానింగ్ యంత్రం సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. గర్భిణులకు ఇది ఎంతోమేలు చేస్తుందని వివరించారు. ఏఎంసీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో టెన్నిస్‌బాల్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక
మంథని: జపాన్ షిటోరియా కరాటేకు చెందిన వి ద్యార్థిని మెట్టు హాసిని ఈనెల 9 నుంచి 12వ తేదీ వ రకు మలేషియాలో జరిగే కరాటే పోటీలకు ఎంపికై నట్లు ఇన్‌స్ట్రక్టర్ కె.సమ్మయ్య తెలిపారు. 19ఏళ్ల 61 కేజీల కుమితే విభాగంలో హాసిన ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఆమెను పలువురు అభినందించారు.