జాప్యం చేయడంతోనే ఇబ్బంది | - | Sakshi
Sakshi News home page

జాప్యం చేయడంతోనే ఇబ్బంది

May 11 2025 12:13 AM | Updated on May 11 2025 12:13 AM

జాప్య

జాప్యం చేయడంతోనే ఇబ్బంది

ధాన్యం కొనుగోళ్లలో తీవ్రజాప్యం జరుగుతోంది. 15 రోజులక్రితం కేంద్రంలో ధాన్యంపోశా. శుక్రవారం తూకం వేశారు. ఇంకా కొన్ని బస్తాల ధాన్యం తూకం వేయాల్సి ఉంది. అకాల వర్షంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది.

– వేముల రమేశ్‌, పెద్దబొంకూర్‌

20 రోజులుగా నిరీక్షణే..

ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకుందామనే ఆశతో వస్తే తూకం వేయడంలో జాప్యం చేశారు. తేమశాతం నిబంధనలకు లోబడే వచ్చినా.. బార్‌దాన్‌ ఇవ్వకండా ఇబ్బంది పెట్టారు. ఇపుడు ఇలా కురిసిన వానకు ధాన్యం తడిసింది.

– సంటి నంబయ్య, బొంపల్లి

కవర్లు ఇవ్వలేదు..

ధాన్యం మార్కెట్‌కు తెచ్చి నాలుగు రోజులకంటే ఎక్కువే అయ్యింది. ఎక్కడపడితే అక్కడే ఆరబోసుకుంటున్న టార్పాలిన్‌ కవర్లు ఇవ్వాలని అడిగితే ఇస్తలేరు. అకాల వర్షంతో ధాన్యం తడిసింది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి.

– శంకర్‌, శాస్త్రినగర్‌

20 ట్రాక్టర్ల ధాన్యం తడిసింది

ధాన్యం అమ్మేందుకు కదంబాపూర్‌ గ్రామం నుంచి సుల్తానాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చిన. యార్డులో ఆరబోసినా. కాంటా పెట్టడంలో ఆలస్యం చేసిన్రు. ఇప్పుడు వడ్లన్నీ తడిసినయ్‌. ప్రభుత్వం ఆదుకోవాలి.

– గోస్కుల కవిత కదంబాపూర్‌

జాప్యం చేయడంతోనే ఇబ్బంది
1
1/3

జాప్యం చేయడంతోనే ఇబ్బంది

జాప్యం చేయడంతోనే ఇబ్బంది
2
2/3

జాప్యం చేయడంతోనే ఇబ్బంది

జాప్యం చేయడంతోనే ఇబ్బంది
3
3/3

జాప్యం చేయడంతోనే ఇబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement