పేదలకే ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు

May 5 2025 9:00 AM | Updated on May 5 2025 9:00 AM

పేదలక

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): అర్హులైన పేదలకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెగడపల్లిలో ఆదివారం ఇందిరమ్మ గ్రామ క మిటీలతో సమీక్షించారు. ఇళ్లకు ముగ్గు పోయడం, బిల్లులు మంజూరు చేయించడం కోసం కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంటి విస్తీర్ణం 400 చదరపు అడుగులకు తగ్గినా 600 చదరపు అడుగులకు పెరిగినా బిల్లు రాదనే విషయాన్ని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఓ పెట్రోల్‌ పంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. నాయకులు సారయ్యగౌడ్‌, లంక సదయ్య, రామిడి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కల్యాణ మండపం ప్రారంభం

ఎలిగేడు: ధూళికట్టలోని పద్మనాయక వెలమ సంఘం నిర్మించిన పద్మనాయక కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు ప్రారంభించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

మండే ఎండల్లో బారులు

ఓదెల(పెద్దపల్లి): కొలనూర్‌ లెవల్‌ క్రాసింగ్‌ గే ట్‌ వద్ద ఆదివారం వాహనాలు సుమారు అర్ధగంటపాటు బారులు తీరాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు రామగుండం నుంచి కాజీపేట వైపు వెళ్లే గూడ్స్‌ రైలు నెమ్మదిగా వెళ్లడం, గేట్‌వేసి ఉండడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మండే ఎండల్లో వా హనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దా దాపు అర్ధకిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. గూడ్స్‌ రైలు వెళ్లాక గేట్‌ తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆటోవాలాలను ఆదుకోవాలి

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ఆటోవాలాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో యూనియన్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్‌ కో రారు. గతనెల 25న మెదక్‌లో ప్రారంభించిన ఆటోయాత్ర ఆదివారం పట్టణానికి చేరుకుంది. రవికుమార్‌ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో ఆటోలు నడవక తాము ఉపాధి కోల్పోయామన్నారు. సుల్తానాబాద్‌ ఆటో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల నాంపల్లి, ఆటోడ్రైవర్లు కోటగిరి స్వామి, ఐలయ్య, తిరుపతి, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పాక్‌ జాతీయులు వెళ్లిపోవాలి

పెద్దపల్లిరూరల్‌: పాక్‌ జాతీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చే శారు. ఇందుకోసం పోలీసులు తనిఖీలు విస్తృతం చేసి పాక్‌ జాతీయులను గుర్తించాలన్నారు. జిల్లాకేంద్రంలోని కమాన్‌ వద్ద ఆదివారం పాకిస్తాన్‌ దిష్టిబొమ్మను బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు రాకేశ్‌, రమేశ్‌ ఆధ్వర్యంలో దహనం చేశారు. జమ్ముకశ్మీర్‌ పహల్గాంలో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన మారణకాండ శోచనీయమని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిలారపు పర్వతాలు, తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, కావేటి రాజగోపాల్‌, మేకల శ్రీనివాస్‌, ఈర్ల శంకర్‌, రాజం మహంతకృష్ణ, ఎర్రోళ్ల శ్రీకాంత్‌, పడాల శ్రీధర్‌, సతీశ్‌, పడాల శ్రీనివాస్‌, ఉమేశ్‌, అంజి, సతీశ్‌, వేణు, మధుకర్‌, శివ, సాయి, సురేందర్‌, మహేశ్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భూములు పంపిణీ చేయాలి

ఓదెల(పెద్దపల్లి): మడకలోని ప్రభుత్వ భూ ములను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని హైదరాబాద్‌ సీసీఎల్‌ కలెక్టర్‌ కోయ శ్రీహర్షను ఆదేశించింది. ప్రభుత్వ భూమిని కొందరు భూ స్వాములు ఆక్రమించి సాగు చేసుకుంటున్నార ని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గొస్కె రాజేశం ఇటీ వల సీసీఎల్‌తోపాటు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే నంబరు 510, 506, 492 లోని సుమారు 10 ఎకరాలను పేదలను గుర్తించి పంపిణీ చేయాలని సీసీఎల్‌ ఆదేశాలు జారీచేసింది. స్పందించిన కలెక్టర్‌.. ఓదెల తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు 1
1/3

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు 2
2/3

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు 3
3/3

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement