కబ్జాదారుల్లో గుబులు | - | Sakshi
Sakshi News home page

కబ్జాదారుల్లో గుబులు

May 26 2025 11:57 PM | Updated on May 26 2025 11:57 PM

కబ్జా

కబ్జాదారుల్లో గుబులు

రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలోని టెక్స్‌టైల్‌, కుర్సికం, ప్రభుత్వ భూముల్లో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీ అధికారులు ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో ఆ భూములపై వివాదాలు తలెత్తకుండా, ఇప్పటికే సమస్యలు ఉంటే ముందే పరిష్కరించి విమానాశ్రయం లేదా భారీ పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

పరిహారం చెల్లింపుల్లో కదలిక..

సుమారు నాలుగు దశాబ్దాల క్రితంనాటి అంతర్గాం స్పిన్నింగ్‌, వీవింగ్‌ మిల్లు కార్మికుల భూ సమస్య, పరిహారం చెల్లింపులపై ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో కదలిక మొదలైంది. భూ పరిపాలన శాఖ అధికారి (సీసీఎల్‌ఏ)తో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌ ఇటీవల సుదీర్ఘంగా చర్చించారు. ఆ త ర్వాత బర్మా, శ్రీలంక, కాందీశీకుల కుటుంబాలతో టెక్స్‌టైల్‌, రెవెన్యూ అధికారుల నుంచి సమగ్ర స మాచారం సేకరించాలని సీసీఎల్‌ఏ నుంచి ఆదేశా లు జారీచేశారు. ఇంతలోనే బర్మా, కాందీశీకులతో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అత్యవసరంగా సమావేశమయ్యారు. వారి డిమాండ్ల గురించి తెలుసుకున్నారు.

బతుకు దెరువు కోసం వచ్చి..

బర్మా, శ్రీలంక, కాందీశీకులు బతుకు దెరువు కోసం అంతర్గాం వలస వచ్చారు. వారికి ఉపాధి కల్పించేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1964లో అంతర్గాం ప్రాంతాన్ని ఎంపిక చేసింది. రీ హాబిలిటేషన్‌ హౌసింగ్‌ లోన్‌ కింద వెయ్యి మంది కా ర్మిక కుటుంబాలకు రూ.41 లక్షలు వెచ్చించి క్వార్ట ర్లు నిర్మించింది. ఇందుకోసం సొసైటీ నిధులతో 96.09 ఎకరాల పట్టా భూములు సేకరించింది. ఆ జామాబాద్‌ ఇండస్ట్రియల్‌ పేరిట ఉన్న మరోచోట 71.30 ఎకరాలు, ప్రభుత్వ భూములు 334.10 ఎకరాలను పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్వాధీనం చే సుకుంది. ఇందులోనే కార్మికుల నివాసాలు, స్పి న్నింగ్‌, వీవింగ్‌ మిల్లు నిర్మించింది. ఒక్కో కుటుంబానికి పది గుంటల విస్తీర్ణంలో క్వార్టర్‌, మిగతా స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకోవాలని సూచించింది. గత 50ఏళ్లలో సుమారు 800 క్వార్టర్లు కుప్పకూలి నామరూల్లేకుండాపోయాయి. 107.34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మిగతా క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. నవంబర్‌ 1991లో మూతపడే నాటికి స్పిన్నింగ్‌ మిల్లు వర్కర్లు 434 మంది, జూన్‌ 1985లో మూతపడే నాటికి వీవింగ్‌ సొసైటీ కార్మికులు 197 మంది ఉన్నారు. అందులో ఇప్పటివరకు 260 మంది మృతి చెందారు. ప్రస్తుతం వారి వారసులు మిగిలారు.

కార్మికుల డిమాండ్లు ఇవే..

● పది గుంటల విస్తీర్ణంలో నివాసం, మిగతా స్థలానికి ప్రహరీ నిర్మించి పట్టాలు ఇవ్వాలి

● వీవింగ్‌ సొసైటీ కార్మికుల వేతన బకాయిలు రూ.1.05 కోట్లు చెల్లించాలి

● వీఆర్‌ఎస్‌లో నష్టపోయిన స్పిన్నింగ్‌ మిల్లు కార్మికులకు రూ.5.50 కోట్ల పెండింగ్‌ పరిహారం విడుదల చేయాలి

● కబ్జాదారుల నుంచి మిల్లులకు చెందిన 200 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలి.

అంతర్గాం టెక్స్‌టైల్‌ భూముల స్వాధీనానికి చర్యలు

భూ సమస్యపై ఉన్నతాధికారుల సమీక్ష

ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు ప్రస్తావనతో కదలిక

స్వాధీనం చేసుకుంటాం

స్పిన్నింగ్‌, వీవింగ్‌ మిల్లులు స్థాపించేందుకు 50 ఏళ్ల క్రితం భూములు కేటాయించారు. వాటిని సర్వే నంబర్ల ఆధారంగా గుర్తించి ఇప్పుడు స్వాధీనం చేసుకుంటాం.

– మక్కాన్‌సింగ్‌ ఎమ్మెల్యే, రామగుండం

కబ్జాదారుల్లో గుబులు1
1/3

కబ్జాదారుల్లో గుబులు

కబ్జాదారుల్లో గుబులు2
2/3

కబ్జాదారుల్లో గుబులు

కబ్జాదారుల్లో గుబులు3
3/3

కబ్జాదారుల్లో గుబులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement