
మీ సేవలో ‘ఆధార్’ సేవలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో ‘ఆధార్’ సెంటర్లు పనిచేసేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. ‘ఆధార్ అవస్థలు’ శీర్షిక న ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించా రు. ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ఆధార్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలన్నారు. జూన్ 3న ఆధార్‌కార్డు అప్‌డేట్ కోసం కలెక్టరేట్‌లో మెగా క్యాంపు ఏర్పాటు చేయా లని ఆదేశించారు. 5 నుంచి 15ఏళ్లలోపు పిల్లల వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయించాలన్నారు. మండల కేంద్రాల్లోనూ ఆధార్ అప్‌డేట్‌కు ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. తప్పుడు చిరునామాల తో వెనక్కి వచ్చిన ఆధార్‌కార్డుల వివరాలను తపాలా కార్యాలయాల నుంచి తెప్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక శిబి రాలు నిర్వహించాలని సూచించారు. యూఐడీఏఐ ప్రాజెక్టు మేనేజర్ నరేశ్‌చంద్ర, జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్ ఉన్నారు.

మీ సేవలో ‘ఆధార్’ సేవలు