లోకో పైలెట్‌కు పురస్కారం
రామగుండం: సీనియర్ లోకో పైలెట్ సీహెచ్ రవి రైల్వే సంరక్ష పురస్కార్ అవార్డు–2025 అందుకున్నారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) భరతేశ్ కుమార్ జైన్ నుంచి ఆయన సోమవారం సికింద్రాబాద్‌లో అవా ర్డు స్వీకరించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో లారీ రైల్వే పట్టాలపై నిలిచిపోగా, సకాలంలో దానిని గుర్తించిన లోకో పైలెట్ రవి.. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలపడంతో ఐదుగురి ప్రాణాలు కాపాడినట్లయ్యిందని డీఆర్‌ఎం వివరించారు. డివిజనల్ స్థాయిలో ముగ్గురు లోకో పైలెట్లకు ఈ అవార్డులు రాగా అందులో రామగుండం పైలెట్ ఉన్నారని పేర్కొన్నారు. రవిని పలువురు లోకో పైలెట్లు అభినందించారు.
అభ్యసన సామర్థ్యం పెంపొందించాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): విద్యార్థుల్లో అ భ్యసన సామర్థ్యం మెరుగుపరిచేలా ఉపాధ్యా యులకు శిక్షణ ఇస్తున్నామని డీఈవో మాధవి తెలిపారు. గర్రెపల్లి జెడ్పీ హైస్కూల్‌లో జీవశాస్త్రం ఉపాధ్యాయులకు సామర్థ్య నిర్మాణంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. డీఈవో సోమవారం శిబిరాన్ని పరిశీలించి మాట్లాడా రు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలలో అమలు చేయాలన్నారు. విద్యార్థులు అన్నిసామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ వి.కవిత, రిసోర్స్ పర్సన్స్ నరేశ్, కుమార్, సాధన, ప్రత్యక్ష, సీఆర్సీలు కిరణ్‌కుమార్, రజియా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
‘రోహిణి’లో ఆరుద్ర ప్రత్యక్షం
జ్యోతినగర్(రామగుండం): వానాకాలం సీజన్ ఈనెల 25న(రోహిణి కార్తె ప్రవేశంతో) ప్రారంభమైంది. ఈమేరకు రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్నిచోట్ల వ ర్షాలు కురవగా.. అన్నదాతలు దుక్కిదున్నడంలో నిమగ్నమయ్యారు. అయితే, రోహిణి కా ర్తెలో ఆరుద్ర పురుగులు కనిపించడంతో రైతు లు తమకు శుభ సంకేతమని భావిస్తున్నారు. సాధారణంగా ఈ పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. సో మవారం పట్టణంలో వాకింగ్‌కు వెళ్లిన వారికి ఈ పురుగులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.
పీపీ గది తొలగింపు
సుల్తానాబాద్(పెద్దపల్లి): నిజాం కాలంలో ని ర్మించిన పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో గల పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) గది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియక కక్షిదారులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది భయంతో వణుకుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరగకముందే దీనిని కూల్చివేయాలని సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. హైకోర్టు ఇందుకు అనుమతి ఇచ్చిందని అసోసియేషన్ కార్యదర్శి భూమయ్య, న్యాయవాదులు తెలిపారు. ఈమేరకు జేసీబీ సాయంతో సోమవారం పీపీ గది తొలగించారు. కాగా, మున్సిఫ్ కోర్టు కార్యకలాపాలను కొత్త భవనంలోకి తరలించగా, పాత భవనం ఖాళీగానే ఉంటోంది.
జీవో నంబరు 44ను అమలు చేయాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రాథమిక సహకార సంఘాల కోసం జారీచేసిన జీవో నంబరు 44లో పొందుపరిచిన అంశాలను సక్రమంగా అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగోని శంకర్ కోరారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో ప్రకారం బదిలీలకు వ్యతిరేకం కాదని, బ్యాంకు ఉద్యోగుల మాదిరిగా ప్రతీనెల ఒకటో తేదీన పాలకవర్గాలకు సంబంధం లేకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. సంఘం అభివృద్ధి కోసం కష్టపడే వారిని ప్రభుత్వం గుర్తించాలని విన్నవించారు.
లోకో పైలెట్‌కు పురస్కారం


