లాంగ్‌వాల్ పనులు త్వరగా పూర్తి చేయండి
రామగిరి: లాంగ్‌వాల్ పనులను నిర్దేశించిన సమయంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆపరేషన్స్ డైరెక్టర్ ఎల్‌వీ.సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం అడ్రియాల లాంగ్‌వాల్ గనిని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లాంగ్‌పనులు పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను జీఎం కొలిపాక నాగేశ్వర్‌రావు డైరెక్టర్‌కు వివరించారు. 3వ ప్యానెల్ సాల్వేజింగ్ పనుల పురోగతి, 4వ ప్యానల్ తయారీ పనులపై చర్చించి భద్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం గనిలోకి వెళ్లి పాత లాంగ్‌వాల్ పనులు, నూతన ప్యానల్ పనులను పరిశీలించారు. కార్పొరేట్ సేఫ్టీ, రామగుండం రీజీనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్లు కె.సాయిబాబా, ఎస్.మధుసూదన్, ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య, ఎస్‌వోటూ జీఎం బండి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఇంజినీర్ టి.రఘురాం, సర్వే అధికారి హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.
లిమ్కా బుక్‌ఆఫ్ రికార్డ్స్‌కు ఎంపిక
కమాన్‌పూర్: మండలంలోని గుండారం గ్రామ ప రిధిలోని రాజాపూర్‌కు చెందిన ముకుంద శ్రావణ్ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎంపికయ్యాడు. విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గతనెల 23న హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
హామీల అమలులో విఫలం
గోదావరిఖని: గత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వకీల్‌పల్లిగనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ 47 హా మీలు, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ ఆరు గ్యారంటీలు, 39 హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. గతంలో ఉన్న హక్కులు కూడా పోయే పరిస్థితులు కల్పించినట్లు తెలిపారు. గ త గుర్తింపు కార్మిక సంఘంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 70కి పైగా కార్మిక హక్కులను సాధించిందన్నారు. నాయకులు చెరుకు ప్రభాకర్‌రెడ్డి, బేతి చంద్రయ్య, వెంకటేశం, రవితేజ, మామిడి తిరుపతి, హరిప్రసాద్, దాసరి శ్రీనివాస్, నరేశ్, చౌడ శ్రీనివాస్, వెంకటస్వామి, రాజారాం, సురేందర్, మల్లేశ్‌నాయక్, రాజమౌళి, ఆవుల రాములు, సిరిశెట్టి రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.
లాంగ్‌వాల్ పనులు త్వరగా పూర్తి చేయండి
లాంగ్‌వాల్ పనులు త్వరగా పూర్తి చేయండి
లాంగ్‌వాల్ పనులు త్వరగా పూర్తి చేయండి


