కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళన
కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కూల్చివేతలకు నిరసనగా శుక్రవారం అఖిల పక్ష జేఏసీ ఆధ్వర్యంలో బల్దియా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మాజీ ఎ మ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు బీఆర్‌ఎస్ నా యకులు కౌశిక హరి, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ బల్దియా అధికారులు, కాంగ్రెస్ పాలకులు దుకాణాలను కూల్చివేసి చిరువ్యాపారుల జీవితాలను రోడ్డున పడేస్తున్నారని అన్నారు. గోదావరిఖని చౌరస్తా సమీపంలో తమలపాకులు విక్రయించుకునే సిరిశెట్టి మల్లేశ్‌కు చెందిన దుకాణాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ, న్యా యం కోసం బాధిత కుటుంబం ఆరురోజులుగా కూల్చిన శిథిలాల ఎదుట నిరసన దీక్ష చేస్తుంటే, బ ల్దియా అధికారులతోపాటు ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం మున్సి పల్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. అఖిల పక్ష జేఏసీ నాయకులు కొండపర్తి సంజీవ్, కోమళ్ల మహేశ్, పిడుగు కృష్ణ, తోట వేణు, మూల విజయారెడ్డి, ఐ.కృష్ణ, గోపు అయులయ్యయాదవ్, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, జేవీ రాజు పాల్గొన్నారు.


