రూ.కోటితో బీటీ రోడ్డు నిర్మాణం
పెద్దపల్లిరూరల్: సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామశివారులో రూ.99 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఈ రోడ్డు పనులు జాతర వరకల్లా పూర్తి చేయిస్తానని తెలిపారు. సర్పంచ్ రాజయ్య, నాయకులు ముత్యాల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలతో బీటీ రోడ్డు చేపట్టాలి
సుల్తానాబాద్‌రూరల్: నాణ్యత ప్రమాణాలతో బీటి రోడ్డు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్–కొదురుపాక గ్రామాల మధ్య సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు డీఎంఎఫ్‌టీ నిధులు రూ.95లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచులు సతీశ్, ఉత్తమకుమారి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు చేయూత
జూలపల్లి: పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు రూ.24,02,784 విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మహిళా సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ఆధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. యాసంగిలో యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎకరాకు 3బస్తాలను ప్రత్యేక యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. తహసీల్దార్ వనజ, సర్పంచులు వెంకటేశం, శ్రీనివాస్, అనూష, ప్రశాంతి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


