
మారుపేర్ల డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలి
గోదావరిఖని: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ వి చారణ పేరుతో పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగాలివ్వాలని మారుపేర్ల బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ ఇందిరా పార్క్‌వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడు తూ వెయ్యి మంది నిరుద్యోగులను మారుపేర్లు, వి జిలెన్స్ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్క శ్రావణ్‌గౌడ్, ప్రతినిధులు తిరుమల శ్రీనివా స్, ఈర్ల రాజయ్య, డిష్‌బాబు, రంజిత్, సందీప్, సత్యం, సంతోష్, రాజేందర్, శ్రావణ్, ఓంప్రకాశ్, సుధాకర్, నరేశ్, రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.