జగిత్యాలటౌన్: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో చేపల మార్కెట్ లోపల వాహనాలు పార్క్ చేస్తుండటంతో కొనుగోలుదారులు నిలబడటానికి స్థలం లేకుండాపోయింది. ఈ సమస్యపై మార్చి 19న ప్రచురితమైన కథనానికి మున్సిపల్ కమిషనర్ స్పందన స్పందించారు. చేపల మార్కెట్ నుంచి వాహనాలు తొలగించాలని తమ సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ మారుతి వాహనాలను తొలగింపజేశారు. కాగా, వాహనాల తొలగింపుతో మార్కెట్‌లో సౌకర్యవంతంగా ఉందని, తక్షణమే స్పందించిన బల్దియా సిబ్బందితో పాటు వార్త ప్రచురించిన ‘సాక్షి’కి కొనుగోలుదారులు ధన్యవాదాలు తెలిపారు.
వాహనాలు పార్కింగ్ వీడాయి