
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఉద్యానవన శాఖ అధికారులతో సాగు విస్తీర్ణం పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ ఏడాది జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. సాగుతో కలిగే లాభాలు, మొక్కలు, డ్రిప్, అంతర పంటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ, ఆదాయం వివరాలను రైతులకు సులువుగా అర్ధమయ్యేలా వివరించి వారు సాగుపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి జగన్మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పిల్లల సమస్యలుంటే 1098కు కాల్‌చేయండి
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన వారికి ప్ర భుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ శ్రీహర్ష అ న్నారు. సీ్త్రశిశు సంక్షేమశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పిల్లలు అందరూ చదువుకోవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా ఆర్థి కసాయం అందిస్తుందని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే సత్వరమే 1098 నంబరుకు కాల్‌చేసి స మాచారం అందించాలని, తక్షణమే స్పందించి సా యమందిస్తారన్నారు. జిల్లా సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాల్, అధికారులు జితేందర్, కనకరాజు, రజిత, అనిల్ తదితరులు ఉన్నారు.
17లోగా దరఖాస్తు చేసుకోండి
జిల్లాలోని లైసెన్స్ సర్వేయర్లు శిక్షణ పొందేందుకు ఈనెల 17లోగా దరఖాస్తు సమర్పించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ దరఖాస్తులు స్వీకరిస్తోందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నా రు. వివరాలకు 98490 81489, 70326 34404, 94419 47339 నంబర్లలో సంప్రదించాలన్నారు.