
భద్రతా బలగాల హైఅలర్ట్
గోదావరిఖని: పాక్ దాడులు, మనదేశం ప్రతిదా డుల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అ ప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది. ప్రాజెక్టులు, పరిశ్రమల్లో భద్రత కట్టుదిట్టం చేసింది.
కీలక ప్రాంతాలపై నిఘా..
సివిల్ పోలీస్, ఎన్టీపీసీలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తమైయ్యా యి. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, కేశోరాం పరిశ్రమల్లో భద్రతత కట్టుదిట్టం చేస్తున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆయా పరిశ్రమ లు, ప్రాజెక్టులకు అధికారులు ఆదేశాలు జారీ అ య్యాయి. కీలక ప్రాంతాలపై నిఘా పెంచాలని, సమస్యలు తలెత్తితే వెంటనే తమకు సమాచారం అందించాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఈమేరకు పె ద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారుల తో పాటు ఎన్టీపీసీకి భద్రత కల్పిస్తున్న సీఐఎస్ ఎఫ్ అఽధికారులతోనూ శాంతిభద్రతల పరిరక్షణ పై సీపీ సమీక్షించారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా కొనసాగిండంతోపాటు అవసరమైతే ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో డేగకళ్లతో నిఘా ఉంచాలన్నారు.
సమన్వయం – అప్రమత్తం
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీపీ అంబర్ కిశోర్ ఝా తన కార్యాలయంలో గురువారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని సింగరేణి, ఏన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, ప్రధానమైన పారిశ్రామిక సంస్థల అధికారులు, భద్రతా అధికా రులు, పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించిన సీపీ.. దాడులు, ప్రతిదాడుల నేప థ్యంలో భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ప్రధానమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. రక్షణ, భద్రతా వ్యవస్థలను కట్టదిట్టం చేయాలని ఆదేశించారు. రక్షణ పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ఇందుకోసం అన్నిశాఖలను సమన్వయం చేసుకోవాలని అన్నారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగులు, శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లకుండా, సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ( అడ్మిన్) రాజు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు సుధేశ్ జంకర్, సర్వర్, రాజు, ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్, ఆర్జీ–1, 2, 3, శ్రీరాంపూర్ సింగరేణి జీఎంలు లలిత్ కుమార్, రాముడు, సుధాకరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాక్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం
శాంతిభద్రతలపై పరిరక్షణపై సమీక్షించిన రామగుండం సీపీ
నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసు బలగాలకు దిశానిర్దేశం
ఎన్టీపీసీ ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన సీఐఎస్‌ఎఫ్ బలగాలు

భద్రతా బలగాల హైఅలర్ట్