
నిరంతరం తాగునీరు
● రామగుండం నగరంలో ప్రతీరోజు తాగునీరు అందిస్తున్నాం ● జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రోజువిడిచి రోజు సరఫరా చేస్తున్నాం ● మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అరుణశ్రీ తెలిపారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా లీకేజీలు, నీటివనరుల లభ్యత, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

నిరంతరం తాగునీరు