
సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
● ఎమ్మెల్యే విజయరమణారావు
ఎలిగేడు(పెద్దపల్లి): భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. నర్సాపూర్‌లో బుధవారం చేపట్టిన భూభారతి రెవన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా సామాన్యులకు సాదాబైనామా ద్వారా రిజిస్ట్రేషన్ హక్కులు పొందేవీలు కల్పించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనన్నారు. పేదలకు కడుపునిండా అన్నం పెట్టేందుకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ యాకన్న, డిప్యూటీ తహసీల్దార్ తిరుపతి, ఎంపీడీవో భాస్కర్‌రావు, సీనియర్ అసిస్టెంట్ స్వాతి, ఆర్‌ఐ చంద్రశేఖర్, సింగిల్‌విండో చైర్మన్ గోపు విజభాస్కర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేత దుగ్యాల సంతోష్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కాటమయ్య మోకులతో ప్రమాదాలు దూరం
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం కాటమయ్య మోకులు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. వివిధ గ్రామాలకు చెందిన గీతకార్మికులకు ఆయన కాటమయ్య మోకులు పంపిణీ చేసి మాట్లాడారు. నాయకులు ప్రకాశ్‌రావు, దామోదర్‌రావు, గోపగాని సారయ్యగౌడ్, బైరి రవీందర్‌గౌడ్, పొన్నం చంద్రయ్యగౌడ్, చిలుకసతీశ్, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 52మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. తహసీల్దార్ రాంచందర్‌రావు, నాయబ్ తహసీల్దార్ రాకేశ్, ఆర్‌ఐ వినోద్, సమ్మయ్య ఉన్నారు.