
స్కూళ్లను అభివృద్ధి చేయాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడాలని డీఈవో మాధవి సూచించారు. గర్రెపల్లి మోడల్ స్కూల్ లో ఆంగ్లం పాఠ్యాంశం ఉపాధ్యాయులకు ‘కెపాసి టీ బిల్డింగ్’ అంశంపై శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నా రు. డీఈవో బుధవారం తనిఖీ చేశారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా బోధనలో మెలకువలు నేర్చుకుని అభ్యసన సామర్థ్యాలు పెంపొందేలా వి ద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఆంగ్లంలో వెనుకబడిన వారిని గ్రూపులుగా విభజించి భాషపై పట్టు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కరీంనగర్ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ మొండయ్య, సెంటర్ అబ్జర్వర్ ప్రద్యుమ్నకుమార్, ఎంఈవో రాజ య్య, ప్రిన్సిపాల్ బల్బీర్‌కౌర్, రిసోర్స్ పర్సన్లు జగదీశ్వర్, శ్రీనివాస్, నాగరాజు, కిరణ్ పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరణ
రామగుండం: స్థానిక బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా దాసరి శంకరయ్య బు ధవారం ఉద్యోగ బా ధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్‌ఈగా కొనసాగిన విజేందర్ వైటీపీపీకి బదిలీపై వెళ్లారు. 11 నె లల క్రితమే రామగుండం బీ– థర్మల్ కేంద్రం మూ తపడింది. సాంకేతిక అవసరాల కోసం విద్యుత్‌సౌ ధ కొందరు ఇంజినీర్లను ఇక్కడే కొనసాగిస్తోంది. కాగా, శంకరయ్యను ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శేఖర్, కరణ్‌కుమార్, అరుణ్, దుర్గయ్య, పి.శంకర్‌శాలువాతో సత్కరించారు.

స్కూళ్లను అభివృద్ధి చేయాలి