యువత కోసమే జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

యువత కోసమే జాబ్‌మేళా

May 16 2025 1:49 AM | Updated on May 16 2025 1:49 AM

యువత

యువత కోసమే జాబ్‌మేళా

గోదావరిఖని: యువత భవిష్యత్‌ బలోపేతమే లక్ష్యంగా మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని నిరుద్యోగుల కోసం ఈనెల 18న స్థానిక జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తారన్నారు. నోబెల్‌ ఎడ్యుకేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ అసోసియేషన్‌, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌మేళాలో వందకుపైగా ప్రఖ్యాత సంస్థలు పా ల్గొంటాయన్నారు. వివరాల కోసం 94911 44252, 99483 77353లో సంప్రదించాలని సూచించారు. ఏసీపీ రమేశ్‌, జీఎంలు లలిత్‌కుమార్‌, వెంకటయ్య, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాబ్‌మేళా ఏర్పాట్ల ను ఏసీపీ రమేశ్‌, జీఎం లలిత్‌కుమార్‌ పరిశీలించారు. వన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, పర్సనల్‌ డీజీఎం కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం

పెద్దపల్లిరూరల్‌: ప్రజాసంక్షేమం, పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి, మినీట్యాంక్‌ బండ్‌ వద్ద పబ్లిక్‌టాయిలెట్లు, ప్రభుత్వ ఐటీఐలో ప్రహరీ తదితర పనులను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించి మాట్లాడా రు. వాకర్స్‌ అసోసియేషన్‌ వినతిమేరకు ట్రాక్‌ చుట్టూ విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌(ఏటీసీ) భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్‌ వెంకటరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిటిజన్‌హాల్‌ సందర్శన

రామగుండం: కార్పొరేషన్‌ 22వ డివిజన్‌ ఇందిరమ్మకాలనీలోని సీనియర్‌ సిటిజన్‌హాల్‌ను మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ గు రువారం సందర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసం భవనం వినియోగించాలని అన్నారు. భవనంలో మహిళలకు కుట్టు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని మాజీ కార్పొరేటర్‌ నస్రీన్‌బేగం విన్నవించారు. మహిళా కాంగ్రెస్‌ అంత ర్గాం మండల అధ్యక్షురాలు నాజియాసుల్తానా, నాయకులు మహ్మద్‌ ఉస్మాన్‌ షరీఫ్‌, ఇంజినీర్‌ రామన్‌ తదితరులు పాల్గొన్నారు.

మెకానిక్‌ కార్మికుల ‘టూల్‌ డౌన్‌’

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఆర్‌ఎఫ్‌సీఎల్‌ క ర్మాగారంలో మెకానిక్‌ కార్మికులు గురువారం టూల్‌డౌన్‌ సమ్మె చేశారు. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఒక్కరోజు టూల్‌ డౌన్‌ నిర్వహించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు అంబటి నరేశ్‌ మాట్లాడుతూ, మెకానిక్‌ కాంట్రాక్టు కార్మికుల పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. యాజమా న్యం స్పందించకుంటే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ గేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.1.40కోట్లను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మంజూరు చేశారని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలోని హైస్కూల్‌లో అదనపు గదుల నిర్మాణానికి ఈ నిధులు వెచ్చిస్తారని ఆయన పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో విదార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

యువత కోసమే జాబ్‌మేళా 1
1/2

యువత కోసమే జాబ్‌మేళా

యువత కోసమే జాబ్‌మేళా 2
2/2

యువత కోసమే జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement