ఆహ్లాదం.. ఆరోగ్యం
● సిమ్మింగ్‌పై ఆసక్తి ● అందుబాటులో ఈతకొలనులు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి కార్మిక, ఉద్యోగుల పిల్లలతోపాటు ప్రభావిత గ్రామాల విద్యార్థులు, ప్రజల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన స్విమ్మింగ్‌పూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్జీ–2 ఏరియా సింగరేణి యాజమాన్యం సుమారు పదేళ్లక్రితం వీటికి రూపకల్పన చేసింది. స్థానిక సీఈఆర్ క్లబ్ ఆవరణలో నిర్మించిన రెండు ఈతకొలనులకు స్విమ్మర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. బేబీ ఈతకొలను ఐదేళ్ల నుంచి పనిచేస్తోంది. ఇది 10ఏళ్ల వయసు లోపు చిన్నారుల కోసం, రెండోది 10 ఏళ్ల నుంచి 40ఏళ్ల వయసు వారికోసం కేటాయించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడతో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఈతకొలనుల దారిపట్టారు. రోజూ స్విమ్మింగ్ చేస్తున్నవారు కొందరైతే.. ఈత నేర్చుకుంటున్నవారు మరికొందరు. వీరిరాకతో స్విమ్మింగ్‌పూల్స్ సందడిగా మారాయి. సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా స్విమ్మింగ్ కోచ్‌ను నియమించి ఈత నేర్పిస్తోంది. ఇక్కడ మెలకువలు నేర్చుకున్న చాలామంది స్విమ్మర్లు వివిధ విభాగాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో ప్రతిభ చూపారు. మెడల్స్ సాధించారు.
సంతోషంగా ఉంది
నాకు ఈత అంటే ఇష్టం. ఈత నేర్చుకునేందుకు సీఈఆర్ క్లబ్‌లో ఈతకొలను అందుబాటులో ఉంది. కోచ్ సురేశ్ ఈతలో మెలకువలు నేర్పిస్తున్నారు. నేను ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాక్ స్ట్రాక్ విభాగంలో మెడల్ సాధించడం సంతోషంగా ఉంది.
– ఎం.రవితేజ, బీటెక్, యైటింక్లయిన్‌కాలనీ
రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న
సింగరేణి ఆర్జీ–2ఏరియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈతకొలనులో నేను సుమారు ఐదేళ్ల నుంచి ఈత ప్రాక్టీస్ చేస్తున్న. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో పాల్గొన్న బటర్‌ఫ్లై విభాగంలో మెడల్ సాధించడం ఆనందంగా ఉంది. – సుప్రతీక్,
తొమ్మిదో తరగతి, యైటింక్లయిన్‌కాలనీ
సీఈఆర్ క్లబ్‌లోని ఈతకొలను
ఆహ్లాదం.. ఆరోగ్యం
ఆహ్లాదం.. ఆరోగ్యం


