అంతర్గాంలో ఎయిర్‌పోర్టుపై..
పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు దశాబ్దాల కల. వివిధ సాంకేతిక కారణాలతో అక్కడ ముందుకు సాగలేదు. కానీ, బసంత్‌నగర్‌కు బదులు అంతర్గాం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సముఖత చూపింది. దీంతో ఈనెల 4న ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులు అంతర్గాం ప్రాంతంలో పర్యటించారు. అందుబాటులోని ప్రభుత్వ భూములు పరిశీలించారు. ఏఏఐ సూచించిన అభ్యంతరాలు పరి ష్కరించి, భూసేకరణ చేపడితే విమానాశ్రయం కల నెరవేరుతుంది.
పెద్దపల్లిలో బస్సుడిపో పనులు ప్రారంభం
పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల ఆర్టీసీ బస్సుడిపో. నవంబర్ 19న ఎమ్మెల్యే విజయరమణారావు డిపో పను లు ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్‌ను ఆ నుకుని ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు తొలగించి ఆ స్థలంలో డిపో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 45 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి పట్టణాభివృద్ధి కోసం బైపాస్ రోడ్డు మంజూరు చేసింది. భూమి సేకరణ కోసం అధికారులు ఎంజాయ్‌మెంట్ సర్వే చేస్తున్నారు. ఈప్రక్రియ పూర్తయితే డిపో పనులు వేగవంతం కానున్నాయి.
అంతర్గాంలో ఎయిర్‌పోర్టుపై..


