మారుపేర్ల సమస్య పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి

Dec 30 2025 7:02 AM | Updated on Dec 30 2025 7:02 AM

మారుప

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి

గోదావరిఖని: సింగరేణి మారుపేర్ల బాధితుల సమ స్య పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ కోరారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మారుపేర్ల బాధితులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటును వెంటనే ఏర్పాటు చేయాలని, పారిశ్రామికీకరణతో ఉపాధి కోల్పోయిన గౌడకులస్తుల కోసం సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టుల సమీపంలోని ఖాళీస్థలాలు అప్పగిస్తే తాటి, ఈతవనాలను ఏర్పాటు చేసుకుంటారని, 50ఏళ్ల వయసు నిండిన విశ్వబ్రాహ్మణులకు పింఛన్లు మంజూరు చేయాలని ఆయన కోరారు.

ముగిసిన ఎస్జీఎఫ్‌ కరాటే టోర్నీ

కోల్‌సిటీ(రామగుండం): నగరంలోని ఆర్‌సీవోఏ క్లబ్‌లో అండర్‌–17 చేపట్టిన ఎస్జీఎఫ్‌ రాష్ట్రస్థాయి కరాటే టోర్నీ, ఎంపిక పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 240 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్‌ నేతృత్వంలో పోటీలు నిర్వహించారు. దాసరి మల్లేశ్‌ పర్యవేక్షించారు. ఇన్‌చార్జి డీఈవో హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతినిధులు కరాటే శ్రీనివాస్‌, వడ్డేపల్లి సురేశ్‌, పసునూటి శంకర్‌, మంధని నాగరాజు, పసునూటి చందు, శ్రావణ్‌ కుమార్‌, సుంకే రాజు, బండి పరమేశ్‌, పవన్‌, బోయపోతు రాము, అన్వేశ్‌ రిఫరీలుగా వ్యవహరించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోచ్‌, మేనేజర్లుగా ముక్తిశ్రీ, సునేహ సుల్తానా తదితనేలే పాల్గొన్నారు.

13 బంగారు పతకాలు.. జాతీయ పోటీలకు 13 మంది..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన 13 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో పుణెలో జరగనున్న జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ పోటీలకు 13 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించినవారిలో సృష్టి టుమానే, శ్రీహర్ష, శ్రీవల్లి, పి.శ్రీజ, బి.సహస్త్ర, పి.సహస్త్ర, శ్రీరాజ్‌ విఘ్నేశ్‌, టి.జయసాయిచరణ్‌, ఆకాశ్‌, డి.శివహర్షవర్ధన్‌, డి.దేవాన్ష్‌ ఉన్నారు. ముగింపు కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు డి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్‌కుమార్‌, కోశాధికారి రాజ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు కేఎస్‌ వాసు, రాష్ట్ర పేట అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు కొమురోజు శ్రీనివాస్‌, శోభారాణి, జావిద్‌, విజయ్‌, ఖాజాభీ రమేశ్‌, కనకేశ్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆశ వర్కర్ల ధర్నా

పెద్దపల్లి: ఆశ వర్కర్లకు నెలకు రూ.18వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జ్యోతి కోరారు. కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించలేదన్నారు. యూనియన్‌ నాయకులు రూపారాణి, శారద, బి.రమాదేవి బి.శారద, మల్లేశ్వరి, సునీత, స్వప్న స్వరూప తదితరులు పాల్గొన్నారు.

పెళ్లయిన రెండు నెలలకే..

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

కథలాపూర్‌(వేములవాడ): కథలాపూర్‌ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన కండ్లి లోకేశ్‌ (23) బైక్‌ అదుపుతప్పి కింద పడి మృతిచెందాడు. ఎస్సై నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం.. లోకేశ్‌కు కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన శ్వేతతో రెండు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం రాత్రి బైక్‌పై భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్తున్నాడు. తక్కళ్లపెల్లి శివారులో బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో లోకేశ్‌, శ్వేత తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో లోకేశ్‌ మృతిచెందాడు. వివాహమైన రెండు నెలలకే లోకేశ్‌ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి తండ్రి గంగాధర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వాహనం అదుపు తప్పి యువకుడి మృతి

రాయికల్‌: భూపతిపూర్‌లో జరిగిన రోడ్డు ప్ర మాదంలో చింతలూరుకు చెందిన జటోతు భూమేశ్‌(19) మృతిచెందాడు. భూమేశ్‌ స్నే హితుడైన దినేశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రాయికల్‌ నుంచి చింతలూరు వైపు వెళ్తున్నా రు. భూపతిపూర్‌ శివారులో వాహనం అదుపుతప్పి రేలింగ్‌కు ఢీకొనడంతో భూమేశ్‌ తలకు తీవ్రగాయాలై మృతిచెందాడు. గాయపడిన దినేశ్‌ను ఆస్పత్రికి తరలించారు.

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి 1
1/2

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి 2
2/2

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement