వైద్యులను సంప్రదించండి
పెద్దపల్లి: జిల్లాలో చలితీవ్రత పెరిగింది.
రెండుమూడ్రోజులుగా రాత్రివేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కొందరు జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నిమోనియా, ఆస్తమా తదితర దీర్ఘకాలిక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి అందించే వైద్యసేవలు, పాటించే జాగ్రత్తల కోసం ‘సాక్షి’ సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్‌కుమార్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా పలువురు బాధితులు ఆయనను ఫోన్‌ద్వారా సంప్రదించారు. వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. వివరాలు..
దగ్గుతో ఇబ్బంది పడుతున్నాం. ఏం చేయాలి?
– మేచినేని గోపాల్‌రావు, ధూళికట్ట
డీఎంహెచ్‌వో: సమీపంలోని వైద్యులను సంప్ర దించి చికిత్స తీసుకోండి. చలితీవ్రత దృష్ట్యా బయటకు వెళ్లకపోవడమే మంచిది.
జిల్లాలో జ్వరబాధితులు ఉన్నారు. నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటి?
– తాండ్ర సదానందం, జిల్లా కార్యదర్శి, సీపీఐ
డీఎంహెచ్‌వో: మా సిబ్బందితో నిత్యం సర్వే చేస్తున్నాం. జ్వరబాధితులను గుర్తించి ఉచితంగా మందులు అందిస్తున్నాం. అయినా తగ్గని వారిని పీహెచ్‌సీలకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం.
సుల్తానాబాద్ ఆస్పత్రిలో ఆక్సిజన్‌లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు?
– అబ్దుల్ హకీం, సుల్తానాబాద్
డీఎంహెచ్‌వో: కలెక్టర్, డీసీహెచ్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తాం.
వైద్యసేవలను విస్తరించాలి
– నరేశ్, పాలకుర్తి
డీఎంహెచ్‌వో: గ్రామాల్లో మూడురోజులపాటు యూనాని, ఇతర వైద్యసేవలు అందించేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయా?
– ఆంజనేయులు, జూలపల్లి
డీఎంహెచ్‌వో: జ్వరం, దగ్గు, జలుబు తదితర వ్యాధులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయి.
చలిలో వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– రాంరెడ్డి, జూలపల్లి
డీఎంహెచ్‌వో: ఉదయం ఏడు గంటల తర్వాతే బయటకు వెళ్లాలి. ముక్కు, చెవులకు ఈదురుగాలులు తగలకుండా తప్పకుండా ఉన్నిదుస్తులు ధరించాలి.
మా ఇద్దరు చిన్నపిల్లలకు శ్వాస సమస్య ఉంది?
– ప్రీతి, ధర్మారం
డీఎంహెచ్‌వో: ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ తాగొద్దు. చలిలో ప్రయాణం చేయొద్దు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – కుమార్, సుల్తానాబాద్
డీఎంహెచ్‌వో: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం ఏడు గంటలకు ముందు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. ప్రతీఒక్కరు ఉన్నిదుస్తులు ధరించాలి.
ఆస్తమా బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
– భిక్షపతి, పెద్దపల్లి
డీఎంహెచ్‌వో: ఇన్‌హేలర్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. డాక్టర్ సూచనలు, సలహా లు తప్పకుండా పాటించాలి.
నిమోనియా బాధితులు ఏంచేయాలి?
– సతీశ్, పెద్దపల్లి
డీఎంహెచ్‌వో: రక్తహీనతతో బాధపడుతున్న వా రు డాక్టర్ల సూచనలు, సలహాల మేరకే బ యటకు వెళ్లాలి. వీరికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు, మందులు ఉచితంగా అందిస్తున్నాం.
వైద్యులను సంప్రదించండి


