‘నూతన’ వేడుకలపై ఆంక్షలు
హల్‌చల్ చేస్తే ఊచలు లెక్కించాల్సిందే.. ప్రజలకు ఇబ్బంది లేకుండా న్యూఇయర్ వేడుకలు వైన్స్ షాప్‌లు, బార్, రెస్టారెంటు ్ల సమయపాలన పాటించాలి డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ రేసింగ్, ర్యాష్ డ్రైవింగ్‌పై నిఘా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
సమన్వయంతో నేరాల నియంత్రణ
గోదావరిఖని: ఒకరి సంతోషం మరొకరికి కారాదు విషాదం.. సామాన్య జనానికి ఇబ్బందులు కలుగకుండా వేడుకలు నిర్వహించుకోవాలి. ఆర్భాటాలకు వెళ్లి హల్‌చల్ చేస్తే ఊచలు లెక్కించాల్సిందే అంటున్నారు పోలీసులు. న్యూఇయర్ వేడుకల్లో హద్దుమీరితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. వైన్స్‌షాపులు, బార్‌లు, రెస్టారెంట్లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు పాటించాలంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. డీజేలు, లౌడ్‌స్పీకర్లు, అధిక డెసిబుల్ సౌండ్ సిస్టం, బాణాసంచా వినియోగాన్ని తగ్గించుకోవాలంటున్నారు. మద్యం మత్తులో బైక్ రేసింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తే జైలుకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఈనెల 31 రాత్రి 10గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4గంటల వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం తాగి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు లైసెన్స్ రద్దు చేస్తారు.
పోలీసుల అనుమతి తప్పనిసరి
నూతన సంవత్సర వేడుకలు సమష్టిగా నిర్వహించేందుకు పోలీసుశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సాంస్కృతిక కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలకు తావులేకుండా నిఘా ఉంటుంది. వేడుకలను రాత్రి 12.30 గంటలలోపు ముగించేలా సూచిస్తున్నారు. ప్రజాశాంతికి విఘాతం కలిగించకుండా వేడుకలు జరుపుకోవాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే సీజ్
రాత్రి 12గంటలల్లోగా వైన్స్‌షాప్‌లు, ఒంటిగంటలోగా బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలి. మద్యం తాగి వాహనాలు నడిపితే ఊరుకునేదిలేదు. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా డ్రంక్‌అండ్‌డ్రైవ్ నిర్వహించనున్నారు. మద్యం తాగి పట్టుబడితే లైసెన్స్ రద్దుతోపాటు వాహనాన్ని సీజ్ చేయనున్నారు. దీంతో పాటు కేసునమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నారు. రెండోసారి మద్యం తాగి వాహనం నడిపినట్లు తేలితే జైలు శిక్షకు సిద్ధంగా ఉండాలి.
మహిళల రక్షణ కోసం షీటీంలు..
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యూఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలి. న్యూఇయర్‌పేరుతో అతిగా మద్యం తాగి మహిళలపై వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మహిళల రక్షణ కోసం షీంటీంలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తనిఖీలు చేస్తారు.
పోలీసు నిఘాలో వేడుకలు..
న్యూఇయర్ వేడుకల్లో హద్దుమీరకుండా స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, క్రైం, షీటీం, మఫ్టీ టీంలు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు డ్రంక్‌అండ్‌డ్రైవ్ నిర్వహించనున్నారు. అక్రమ సిట్టింగులు, ఆరుబయట మద్యం తాగడం, గుంపులుగా తిరగడం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
గోదావరిఖని: నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్‌ఝా సూచించారు. తన కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో సోమవారం నేరసమీక్ష జరిపారు. కేసుల పరిష్కార శాతం పెంచాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికతో త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. మహిళల కేసుల్లో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పోక్సో కేసుల్లో బాధితులకు పరిహారం త్వరగా అందేలా చూడాలని అన్నారు. రోడ్డు సేఫ్టీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, ఎస్బీ ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, కృష్ణ, రవికుమార్, నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అంధకారం చేసుకోవద్దు
హద్దులకు లోబడి వేడుకలను నిర్ణీత సమయాల్లోగా నిర్వహించుకోవాలి. తాత్కాలిక ఆనందం కోసం యువత కేసుల్లో ఇరుక్కోవద్దు. ఒక్కసారి కేసు నమోదైతే భవిషత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర దేశాలకు వెళ్లేందుకు వీసాలు రావడం కష్టం. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. – అంబర్ కిశోర్ ఝా,
పోలీస్ కమిషనర్, రామగుండం
‘నూతన’ వేడుకలపై ఆంక్షలు


