అభివృద్ధి వైపు అడుగులు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి వైపు అడుగులు

Dec 30 2025 7:02 AM | Updated on Dec 30 2025 7:02 AM

అభివృద్ధి వైపు అడుగులు

అభివృద్ధి వైపు అడుగులు

● అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని 20 వేల ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.75కోట్లతో నిర్మించిన రామగుండం ఎత్తిపోతలను ఆగస్టు 3న ప్రారంభించారు. తద్వారా ఈప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తొలిపోనున్నాయి. ● రామగుండంలోని 62.5 మెగావాట్ల బీ– థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 1971లో ప్రారంభమై సుమారు 52ఏళ్లకుపైగా సేవలు అందించింది. దాని జీవితకాలం ముగియడంతో గతేడాది జూన్‌ 4న మూసివేశారు. దానిస్థానంలో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం స్థాపనకు నవంబర్‌ 17న రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఎన్టీపీసీ, జెన్‌కోలు ఏదితక్కువ ధరకు స్థాపిస్తామంటే దానికే అవకాశం కల్పిస్తారు. దీనిపై స్పష్టత వస్తేనే ప్రాజెక్టు శంకుస్థాపన జరిగే అవకాశాలు ఉన్నాయి.

రామగుండంలో పవర్‌ ప్లాంట్‌ ఆమోదం తెలిపిన మంత్రివర్గం అంతర్గాంలో ఎయిర్‌పోర్టు..! పెద్దపల్లిలో బస్‌డిపోకు శంకుస్థాపన బైపాస్‌ రోడ్డు కోసం భూసేకరణ మంథనిలో పలు వంతెనలు.. బైపాస్‌ రహదారికి నిధులు

డెవలప్‌మెంట్‌ వాచ్‌

2025

సాక్షి పెద్దపల్లి: జిల్లాలో ఈ ఏడాది

అభివృద్ధి, సంక్షేమం అంతంతంగానే నమోదు అయ్యాయి. పంచాయతీలు, బల్దియాల్లో నిధులు కొరత అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఆరు గ్యారంటీల్లో సంక్షేమం కొంత ఊరట ఇచ్చినా కొత్త పథకాలు రాలేదు. కొత్త పింఛన్ల కోసం నిరీక్షణ తప్పలేదు. కానీ, కొన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి అడుగులుపడ్డాయి. మూడు విడతల్లో రైతురుణమాఫీ కావడంతో అన్నదాతలకు ఊరట లభించింది. రైతుభరోసా, సన్నధాన్యం బోనస్‌ డబ్బులు

రాక నిరాశనే మిగిల్చింది.

పెద్దపల్లి బస్టాండ్‌

ఎత్తిపోతల ప్రారంభం

థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement