నేడు సింగరేణి మెగా జాబ్‌మేళా
గోదావరిఖని: స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నిర్వహించే మెగా జాబ్ మేళాకు సింగరేణి యాజమాన్యం అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. సుమారు వందకుపైగా కంపెనీలు హాజరై అర్హతలను బట్టి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. సింగరేణి యాజమాన్యం, నోబెల్ ఎన్‌ఫర్మెంట్ సొసైటీ ఫౌండర్ సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 8గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహిస్తారు. విద్యార్హతలు, అనుభవం తదితర అంశాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సుమారు 3వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగులకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఎండదెబ్బకు గురికాకుండా కూలర్లు, మంచినీరు, మజ్జిగ, భోజన వసతులు కల్పించారు.


