
ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన రూ.50.50 లక్షల వ్యంతో చేపట్టిన పార్క్‌ల అభి వృద్ధి పనులకు బల్దియా కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే శనివారం రాత్రి 26వ డివిజన్ దు ర్గానగర్‌లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ, రామగుండాన్ని తెలంగాణలో ముఖ్యనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నా రు. ఏడాదిలోనే సుమారు రూ.59 కోట్ల అభివృద్ధి పనులు పూర్తికాగా, మరో రూ.100 కోట్ల పనులు వివిధ దశల్లో కొనసాగతున్నాయని తెలిపారు. ని ర్లక్ష్యానికి గురైన నగరాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఏ ఒక్క నగరవాసి ఈ ప్రాంతం విడిచి వలస వెళ్లిపోకూడదనే లక్ష్యంతో పునర్నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ, ప్రజల మానసికోల్లాసం, ఆహ్లాదం కోసం దుర్గానగర్‌తోపాటు ఏడు పార్క్‌ల్లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈ షాబాజ్, ఏ ఈ తేజస్విని, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కుమారస్వా మి, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, దాసరి ఉమాదేవి, దుర్గానగర్‌కా లనీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్వర్‌రావు, నారా యణ, కాలనీవాసులు బుచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డి, దామోదరాచార్యులు, పి.శ్రీనివా స్, స్వామిగౌడ్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆలయంలో పూజలు
రామగుండం: శ్రీరామునిగుండాల కొండపై స్వ యంభూ వెలిసిన శ్రీధనుర్భానాంజనేయస్వామి దేవాలయంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజారి శ్రీరాంపల్లి మురళీధర్‌శర్మ వేదమంత్రోచ్ఛారణాల మధ్య పూజలు చేయించారు. ఎమ్మెల్యే ము ఖ్య అనుచరులు దీటి బాలరాజు, కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, కోల లక్ష్మణ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్