ప్రజా సంక్షేమమే ధ్యేయం
ధర్మారం(ధర్మపురి): ప్రజా సంక్షేమమే ధ్వే యమని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నా రు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం 106 మందికి రూ.36 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడే వారికి చికిత్స కోసం ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ అమలు చేస్తోందని అన్నారు. అనంతరం ఇటీవల మృత్యువాతపడిన గొర్రెలకు పరిహారం మంజూరు చేయాలని ప్రతిపాదించిన లేఖను బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొర్రెలపెంపకందారులకు విప్ లక్ష్మణ్‌కుమార్ అందించారు. ఆ లేఖను కలెక్టర్‌కు అందించాలని ఆయన సూచించారు. వారంరోజుల్లోగా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకుడు కాంపెల్లి రాజేశం, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో రమేశ్ పాల్గొన్నారు.
నాగలింగేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు
పెద్దపల్లిరూరల్: రాగినేడు గ్రామంలోని స్వ యంభూ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రెండో వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చులాపురం ప్రాంతానికి చెందిన అవధాని దుద్దిళ్ల మనోహరశర్మ ఆధ్యర్వంలో ప్రధాన అర్చకుడు రాజేశ్వరశర్మ తదితరులు గణపతిహోమం, రుద్రహోమం, నవగ్రహపూజాకార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, ఆలయక మిటీ చైర్మన్ భూమయ్య, అవినాష్, కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎంపిక కోసం దరఖాస్తులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూ ల్(రెసిడెన్షియల్, నాన్‌రెసిడెన్షియల్) ఉత్తమ పాఠశాలల ఎంపిక కోసం ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ అధికారి వినోద్‌కుమార్ తెలిపా రు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ రెసిడెన్షియల్‌ప థకం కింద విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్ వ సతి, భోజనంతోపాటు రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాల కోసం రూ.42 వేలు, నాన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు (హాస్టల్ భోజన వసతి మినహాయింపు) ప్రతీ విద్యార్థికి రూ.28 వేల చొప్పున చెల్లిస్తారని పే ర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 24లోగా త మ కార్యాలయంలో అందించాలని, ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
13 పరీక్ష కేంద్రాలు .. 4,230మంది విద్యార్థులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈనెల 22 నుంచి 28 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అ డ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం ఇంటర్ నోడల్ అధికారి కల్పన, డీ ఈవో మాధవితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించా రు. ఈ సంద్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ, జిల్లావ్యాప్తంగా 4,230 మంది విద్యార్థు లు (2,538 మంది ఫస్టియర్, 1,692 మంది సెకండియర్) విద్యార్థుల కోసం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా జిల్లా పరీక్షల కమిటీ ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించిందన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో పరీక్షలు జరపాలని అన్నారు. బీసీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం


