
క్రికెట్ జిల్లా జట్టుకు ఎంపిక
గోదావరిఖనిటౌన్: అండర్–25 క్రికెట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించే జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి డి.కిరణ్‌కుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం(కేడీసీఏ) ఆధ్వర్యంలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులతో ఈనెల 17న స్థానిక జీఎంకాలనీ గ్రౌండ్‌లో అండర్ –25 క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లాకు ఒక జట్టుగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. కోచ్ ఎం. సుదేశ్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారులు జి.సత్యతేజ, ఎండీ జునైద్, డి.శరత్‌చంద్ర, ఆర్.నిఖిలేంద్ర, అఫ్ఫాన్, జి.సాయివినయ్, ఎండీ ఫైజాన్, ఆర్.నితిన్, ఖాజా ముఖారుద్దీన్, జి.మనిరత్నమ్, లోధ్ నిఖిల్, రాహుల్, వేణు, శివ గణేశ్, శరణ్‌ను జిల్లా జట్టుకు ఎంపికై నట్లు ఆయన వివరించారు.
కరాటే విద్యార్థులకు అభినందన
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. కరాటే పో టీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌లో మంగళవారం అభినందించా రు. అండర్ –14 కట్‌ఆఫ్ కుమితి విభాగంలో పలువురు కరాటే విద్యార్థులు 2 బంగారు పతకాలు, 3 వెండి, 3 కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థు లు భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని కలె క్టర్ ఆకాక్షించారు. మాస్టర్ వెంకటేశ్, ప్రిన్సిపాల్ మణిదీప్తి, ఇన్స్‌స్ట్రక్టర్ అలేఖ్య పాల్గొన్నారు.