సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌ | - | Sakshi
Sakshi News home page

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌

May 17 2025 6:59 AM | Updated on May 17 2025 6:59 AM

సీపీన

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌

గోదావరిఖని: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝాను ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుస్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ నాయకులను సీపీకి పరిచయం చేశారు. నాయకులు మహంకాళి స్వామి, ముస్తాఫా, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

పెద్దపల్లిరూరల్‌: పశువులను కబేళాకు తరలించాలని, నాణ్యమైన మాంసం విక్రయించేందుకు పశువైద్యాధికారి అనుమతి పొందాలని ఏసీపీ కృష్ణ సూచించారు. బక్రీద్‌ నేపథ్యంలో సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై లక్ష్మణ్‌రావుతో కలిసి శుక్రవారం కబేళా నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనుమతి మేరకే వాహనాల్లో పశువులను తరలించాలన్నారు. పరిసర ప్రాంతవాసులకు ఇబ్బంది కలిగించేలా పశుమాంస విక్రయాలు చేయవద్దని అన్నారు.

స్వచ్ఛత అందరి బాధ్యత

జ్యోతినగర్‌(రామగుండం): స్వచ్ఛత అందరి బాధ్యతని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. పర్మినెంట్‌ టౌన్‌షిప్‌ ప్రధాన దుకాణ సముదాయంలో శుక్రవారం స్వచ్ఛత పక్షోత్సవాలు నిర్వహించారు. పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతీఒక్కరు పాలుపంచుకోవాలని ఆయన కోరారు. తెలుగు, హిందీ భాషల్లో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్‌ సలీంపాషా, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఉన్నతాధికారి సింఘారాయ్‌, యూనియన్‌ నాయకులు, ఉద్యోగులు కుటుంబసభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

దుకాణాల్లో తనిఖీలు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య దుకాణాలను తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు షాపుల్లో షాంపిళ్లు సేకరించారు. తక్కువ పరిమాణంలో సరుకులు లభించిన 8 దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. రూ.24వేల జరిమానా విధించారు. తూకంలో వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

దోమల నియంత్రణతోనే డెంగీ దూరం

పెద్దపల్లిరూరల్‌: దోమల నియంత్రణతోనే డెంగీ నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి అన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రి వద్ద శుక్రవారం డెంగీ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ప్రగతినగర్‌ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. వచ్చే వానాకాలంలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, ఈనేపథ్యంలో ఇళ్లలోని వ్యర్థాలు తొలగించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు శ్రీరాములు, రాజమౌళి, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేశ్‌, రాజేశం, రవీందర్‌, అంజయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌ 1
1/4

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌ 2
2/4

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌ 3
3/4

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌ 4
4/4

సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement