సింగరేణిలో సమ్మెను విజయవంతం చేయాలి
గోదావరిఖని: బొగ్గు గనుల పరిరక్షణ కోసం, సింగరేణి పరిశ్రమను కాపాడుకునేందుకు ఈనెల 20 న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చే యాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. శనివారం స్థానిక హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో జరిగిన ఐక్యవేదిక నాయకు ల సమావేశంలో హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్‌టీయూ అధ్యక్షు డు ఐ.కృష్ణ, టీఎస్‌యూఎస్ నాయకుడు ఏడుకొండలు మాట్లాడారు. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అమ్మకానికి పెట్టిందని ధ్వజమెత్తారు. నారాయణ, నరేశ్, సారయ్య, రాయమల్లు, కుమారస్వామి, రాజేశం, మల్లేశం, ప్ర సాద్‌రెడ్డి, రవీందర్, రాజిరెడ్డి పాల్గొన్నారు.


