
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
పాలకుర్తి(రామగుండం): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రైతులను ఇ బ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీ సుకుంటామని హెచ్చచించారు. ‘తూకం .. ఆలస్యం’ శీర్షికన శనివారం ‘సాక్షి’ కథ నం ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్.. పెద్దపల్లి మండలం కురుమపల్లి, పా లకుర్తి మండలం బసంత్‌నగర్, కొత్తపల్లిలోని ధా న్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లలో ఎందుకు జాప్యం జరుగుతుందనే విషయంపై నిర్వాహకులను అడి గి వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పగటిపూట హ మాలీలు ధాన్యం తూకం వేయడం లేదని, రాత్రి వేళల్లోనే తూకం వేస్తున్నారని, లారీల కొరతతో నూ జాప్యమవుతోందని నిర్వాహకులు సమాధానమిచ్చారు. స్పందించిన కలెక్టర్.. ఇతర ప్రాంతాల నుంచి హమాలీలను రప్పించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. అకాల వర్షాల తో ధాన్యం తడిసి రైతులు నష్టపోతారని, అలా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్నరకం ధాన్యాన్ని కూడా కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, ఎఫ్‌సీఐ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని 24 గంటల్లోగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, వెయింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాల ని సూచించారు. తహసీల్దార్ జ్యోతి, ఆర్‌ఐ సంతోష్, ఏఈవో శశిధర్, సింగిల్‌విండో సిబ్బంది సదయ్య, పుట్ట వంశీ, నిర్వాహకులు సామంతుల రమేశ్, బీటీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు
కలెక్టర్ కోయ శ్రీహర్ష

వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు