
పని సులభం.. సమయం ఆదా
ఒకప్పుడు తారు రోడ్డు నిర్మించేందుకు వందలాది మంది కార్మికులు రోజుల తరబడి పనిచేసేవారు. రాత్రింబవళ్లు పనిచేసినా నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేందుకు చాలా ఇబ్బందులు తలెత్తేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. అత్యాధునిక యంత్రసామగ్రి అందుబాటులోకి వస్తోంది. దీంతో గంటల్లోనే రహదారులు నిర్మిస్తున్నారు. పని సులభం కావడంతోపాటు ఎంతోసమయం ఆదా అవుతోంది. ఈ నేపథ్యంలోనే హెచ్‌కేఆర్ సంస్థ హైదరాబాద్– కరీంనగర్ – రామగుండం మధ్యగల రాజీవ్ రహదారిని శరవేగంగా మరమ్మతు చేస్తోంది. ఆధునిక యంత్రసామగ్రితో పనులను అత్యంత వేగంగా పూర్తి చేస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై పనుల్లో పాలుపంచుకుంటున్న ఆధునిక యంత్రాలు, వాహనాలు ‘సాక్షి’ కెమెరాకు ఇలా చిక్కాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి