నర్సింగ్ సేవలు వెలకట్టలేనివి
కోల్‌సిటీ(రామగుండం): నర్సింగ్ ఆఫీసర్లు అందించే సేవలు వెలకట్టలేనివని రామగుండం సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబింద్‌సింగ్ కొనియాడారు. సోమవారం గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో అంతర్జాతీయ నర్సింగ్ ఆఫీసర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ స్ఫూర్తితో సేవలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. అనంతరం నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఆఫీసర్లను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కేక్‌ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కాగా, గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ ఆఫీసర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల ఆ టాపాటలు ఆకట్టుకున్నాయి. ఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి వైస్ ప్రిన్సిపాల్ సుశీల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడా పోటీలు, ఉపన్యాసం, సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.


