కాంగ్రెస్‌లో ఉత్సాహం
జిల్లాలోని 262 పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరగ్గా అందులో 181 స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారు. స్వతంత్రులుగా గెలిచిన 13మంది సైతం మూడు రంగుల జెండా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన పరాభావాన్ని పంచాయతీ ఎన్నికలతో పూడ్చుకున్నారు. అలాగే ఈఏడాది డీసీసీ అధ్యక్షుడి కోసం పీసీసీ దరఖాస్తులు స్వీకరించినా.. మరోసారి డీసీసీ అధ్యక్ష స్థానం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌నే వరించింది. వర్షాకాలంలో కురిసిన భారీవర్షాలతో చాలాప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 28న సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు.


