బీజేపీలో కొంతమోదం.. మరికొంత ఖేదం
పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ మంచి మెజార్టీతో గెలుచుకుంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమరయ్య బీజేపీ నుంచిటీచర్స్ ఎమ్మెల్సీ పదవిని కై వసం చేసుకున్నారు. అదే ఊపును స్థానిక ఎన్నికల్లో ప్రదర్శించలేకపోయారు. కేవలం నాలుగు సీట్లతోనే సరిపెట్టుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరశ్యం నింపింది. జిల్లా అధ్యక్షుడి నాయకత్వ లోపం, పార్టీలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలతో ప్రజల్లో బీజేపీపై సానుకూల దృక్పథం నెలకొని ఉన్నా.. దాన్ని ఓట్లరూపంలోకి మార్చుకోవడంలేదనే విమర్శ సొంతపార్టీ నేతల్లోనే నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ జిల్లాలో పర్యటించారు.


