వణుకుతూ.. చన్నీటి స్నానం చేస్తూ..
నాలుగు రోజులుగా చలితీవ్రత పెరుగుతోంది. హాస్టళ్లలో వసతి పొందుతున్న విద్యార్థులు చన్నీటి స్నానాలు చేస్తున్నారు. గురుకులాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఉదయం పది గంటలు దాటినా చలివీడడంలేదు. భానుడి కిరణాలు కూడా చలిగాలుల మాటునే ఉంటున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ జ్యోతిభాపూలే గురుకులంలో ఉదయమే స్నానాలు ఆచరిస్తూ.. గజగజ వణుకుతూ విద్యార్థులు శ్రీసాక్షిశ్రీకి ఇలా కనిపించారు. పెద్దపల్లి ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌లో కిటికీలు విరిగిపోవడంతో పరదాలు అడ్డు పెట్టుకొని విద్యార్థులు తిప్పలుపడుతున్నారు. అయినా, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
వణుకుతూ.. చన్నీటి స్నానం చేస్తూ..
వణుకుతూ.. చన్నీటి స్నానం చేస్తూ..


