గుండెపోటుతో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడి మృతి
● చదువు చెప్పిన పాఠశాలలోనే ఘటన
● వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడిలోకి..
రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఏనుగు రాజిరెడ్డి (65) తాను చదువు చెప్పిన పాఠశాలలోనే వాకింగ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజిరెడ్డి పాఠశాల ఆవరణలో వాకింగ్ చేసేందుకు మంగళవారం వెళ్లాడు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి కుప్పకూలడంతో తోటి వాకర్స్ వెంటనే సీపీఆర్ చేశారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజిరెడ్డికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన మృతిపై వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, పూర్వ విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.
అనారోగ్యంతో జర్నలిస్టు..
సిరిసిల్లటౌన్: సీనియర్ జర్నలిస్టు అనారోగ్యంతో మృతిచెందిన ఘటన మంగళవారం సిరిసిల్లలో జరి గింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన గడ్డం నాగరాజు(44) దశాబ్దంన్నర కాలంగా జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఆర్నెళ్లక్రితం అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందాడు. వారం క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అవగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడికి భా ర్య స్వరూప, ఇద్దరు కుమారులు హరిహరణ్, హర్షవర్దన్ ఉన్నారు. నాగరాజు మృతిపై సిరిసిల్ల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఆడెపు మహేందర్, ఉపాధ్యక్షుడు బొడ్డు పర్శరాములు, సీనియర్ జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు.
ఉరేసుకొని రైతు ఆత్మహత్య
మానకొండూర్: మానకొండూర్ మండలం గట్టు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన గొర్రెంకల చిన్న ఎల్లయ్య (55) అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానకొండూర్ సీఐ బి.సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మానికి చెందిన చిన్న ఎల్లయ్య సాగునీటి కోసం గతేడాది వ్యవసాయ పొలం వద్ద బావిని తవ్వించాడు. అందులో బండ రావడం, బోరువేసినా నీరు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య ఈనెల 29న పొలం పనులకు వెళ్తున్నానని చెప్పి, తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలించగా పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
కాలు కొట్టెస్తారనే భయంతో వ్యక్తి..
ముస్తాబాద్(సిరిసిల్ల ): డయాబెటిస్‌తో కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకగా, ఆందోళనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్తాబాద్ ఏఎస్సై అబ్దుల్‌ఘనీ కథనం మేరకు.. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన పారిపెల్లి సాయిలు(62) మంగళవారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిలు కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. కాలుకు పుండు కావడంతో అది పొందుతున్నాడు. కాలు ఇన్‌ఫెక్షన్‌తో గాయం తీవ్రమైంది. దీంతో కాలు తీసేస్తారనే భయంతో సాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
నలుగురు దొంగల పట్టివేత
మేడిపల్లి: కొన్ని రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని మంగళవారం పట్టుకున్నట్లు మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలో అనుమానాస్పదంగా కొందరు తిరుగుతున్నట్లు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో వారిని పట్టుకున్నారు. వారిని విచారణ చేపట్టగా ఇటీవల మండలకేంద్రంలోని మహాలక్ష్మి మొబైల్ షాప్‌లో తొమ్మిది సెల్‌ఫోన్లు, కోరుట్లలో మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేశామని ఎస్సై తెలిపారు. మేడిపల్లి, భీమారం మండలాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
గుండెపోటుతో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడి మృతి
గుండెపోటుతో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడి మృతి


