పొలిటికల్ జోష్
బీజేపీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన జిల్లావాసి పంచాయతీ ఎన్నిల్లో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకున్న హస్తం పార్టీ కారు పార్టీకి కలిసిరాని 2025 సంవత్సరం డీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి మక్కాన్‌సింగ్ ఎల్లంపల్లిని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంతి బండి సంజయ్
సాక్షి పెద్దపల్లి:
అనేక రాజకీయ మార్పులు, పదవులు, వివాదాలు, సవాళ్లకు ఈ ఏడాది వేదికగా నిలిచింది. కొన్ని పార్టీలకు కలిసోస్తే.. మరికొన్నింటికి చేదు అనుభవాలను మిగిల్చింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటగా, కాంగ్రెస్ రెండోస్థానంతో సరిపెట్టుకుంది, చివరలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కై వసం చేసుకోగా, బీఆర్‌ఎస్ రెండోస్థానంలో నిలిచింది. ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీలో జోష్ నింపగా, పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఊపునిచ్చాయి. గులాబీ పార్టీకి నిరాశ మిగిల్చియి.
కారు పార్టీ సతమతం
గత పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకుని సత్తా చాటిన బీఆర్‌ఎస్ పార్టీ.. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ద్వితీయ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఏడాది మొదట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వడంలోనూ చతికలబడింది. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉన్నా.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో బీఆర్‌ఎస్ నేతలు వెనుకబడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మానేరుపై నిర్మించిన రెండు చెక్‌డ్యాంలు కూలిపోయిన విషయాన్ని పూర్తిస్థాయిలోకి ప్రజల్లోకి తీసుకు వెళ్లలేదని గులాబీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చెక్ డ్యాంల సందర్శనకు నీటిపారుదల శాఖ మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లాకు వచ్చి కూలిపోయిన చెక్‌డ్యాంలను పరిశీలించారు.
పొలిటికల్ జోష్


