
రైతులు ఆందోళన చెందవద్దు.. కొనుగోలు చేస్తాం
ధర్మారం: తడిసిన ప్రతీ గింజా కొంటామని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మారం మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి ధర్మారం, మేడారం కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి నుంచే ఫోన్లో అధికారులతో మాట్లాడి తూకంలో ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు. తరుగు పేరిట మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశంగౌడ్, డైరెక్టర్ కాంపెల్లి రాజేశం, నాయకులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, పొనవేని స్వామి రైతులు పాల్గొన్నారు.