
విపత్తుల సమయంలో రెస్క్యూ సేవలు
● సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడి ● ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి రెస్క్యూ శిక్షణ
గోదావరిఖని: విపత్తుల సమయంలో రెస్క్యూ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణి మెయిన్ రెస్క్యూస్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని డైరెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 36 రోజుల్లో 1,200 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కి శిక్షణ ఇస్తామన్నారు. విపత్తుల నిర్వహణ తీరు పై శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సి న తీరుపై ప్రాక్టికల్‌గా వివరించనున్నామని తెలిపారు. వంద మంది చొప్పున ఒక్కొక్క బ్యాచ్‌కి 3 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. అధునాతన రెస్క్యూ పద్ధతుల తీరు, రెస్క్యూ, రికవరీ విధానాలు, అత్యవసర గాయాల చికిత్స పద్ధతులను వివరించారు. అగ్నిప్రమాదం, భవ నం కూలిపోవడం, గని విపత్తు రక్షణ, ప్రథమ చికిత్స విధానాలను కవర్ చేస్తూ శిక్షణ కొనసాగుతుందని ఆయన వివరించారు. తెలంగాణ ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గుడిపేట 13వ బెటాలియ న్ కమాండెంట్ వెంకట్‌రాములు, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, క్వాలిటీ జీఎం భైద్యా, రెస్క్యూ సూ పరింటెండెంట్ మాధవరావు, సెక్యూరిటీ అధికా రి షరీఫ్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.