
ప్రభుత్వం పట్టించుకోవాలి
ఉపాధిహామీ సిబ్బందికి వెంటనే పే స్కేల్ ప్రకటించాలి. క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. అనేక ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ పే స్కేల్ ప్రకటించి ఆదుకోవాలి.
– వెంకటేశ్‌గౌడ్, జేఏసీ చైర్మన్, పెద్దపల్లి
ఇంటి కిరాయికి ఇబ్బంది
ఇంటి కిరాయి చెల్లించేందుకు చేతిలో పైసలు ఉంటలెవ్వు. ప్రభుత్వం మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వక ఈ పరిస్థితి ఎదురైంది. పే స్కేల్ అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. హామీ అమలు చేయాలి.
– మల్లేశ్వరి, ఏపీఎం, సుల్తానాబాద్
సమ్మెకు వెనుకాడేదిలేదు
పే స్కేల్ ప్రకటన, పెండింగ్ వేతనా ల చెల్లింపుల్లో జాప్యం చేస్తే మేము సమ్మె చేసేందుకు వెనుకాడేదిలేదు. ఒకేశాఖలో పనిచేస్తున్న ఒకరికి పే స్కేల్ అమలు చేస్తూ, మరొకరికి అ మలు చేయకపోవడం సరికాదు.
– జీవన్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్, సుల్తానాబాద్

ప్రభుత్వం పట్టించుకోవాలి

ప్రభుత్వం పట్టించుకోవాలి