
ఆన్‌లైన్ నమోదులో వేగం పెంచండి
కోల్‌సిటీ(రామగుండం): ఇందిరమ్మ ఇళ్లు పీఎంఏ వై, రేషన్‌కార్డు లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని రా మగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులతో ఆయా ద రఖాస్తుల పరిశీలన ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. దారిద్య్రరేఖకు దిగువనవున్న వారికే పథకా ల లబ్ధిచేకూరేలా క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నా రు. వచ్చే వర్షాకాలం దృష్ట్యా పూడికతో నిండిన కా లువల వివరాలు, మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హన్మంతరావు నాయక్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు.