
భూ నిర్వాసితులకు పరిహారం అందించాలి
మంథని: జాతీయ రహదారి నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న నిర్వాసితులకు అర్హతల ఆ ధారంగా పరిహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం మండలంలో ని పు ట్టపాక గ్రామంలో భూ నిర్వాసితులతో సమావేశమయ్యారు. వరంగల్– మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారాన్ని అర్హతల ఆధారంగా అందించాలన్నారు. నిర్వాసితులు అందించిన ప్రతి దరఖా స్తును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి పాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆర్డీవో సురేశ్, జిల్లా అటవీశాఖ అధికారి శివ య్య, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్ సింగ్, హార్టికల్చర్ జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి, తహసీల్దార్ కు మారస్వామి, అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీ హర్ష