
ఈఎస్‌ఐ, బీమా కల్పించాలి
ధూప, దీప నైవేద్యం పథకం కింద పనిచేసే అర్చకులకు ప్రభుత్వం ఈఎస్‌ఐ, ఆరోగ్య బీమా పథకాలను వర్తింప జేయాలి. ఈఎస్‌ఐ కూడా మాకు అమలు చేస్తే.. అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. వీటితోపాటు పేద అర్చకులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మేం కోరుతున్నాం.
– నాగరాజ్ శర్మ,
డీడీఎన్ స్కీం అధికార ప్రతినిధి
వేతనాలు పెంచాలి
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అర్చకుల బాధలను తెలుసుకొని అర్చకులకు వేతనం కల్పించాలనే ఉద్దేశంతో డీడీఎన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. అది ఇప్పటివరకు విజయవంతంగా సాగుతోంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్చకుల బాధని అర్థం చేసుకొని డీడీఎన్ అర్చకులకు వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– రామకృష్ణమాచార్యులు,
జిల్లా అర్చక సంఘం అధికార ప్రతినిధి

ఈఎస్‌ఐ, బీమా కల్పించాలి