
చట్టాలపై అవగాహన ఉండాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా జడ్జి స్వ ప్నరాణి అన్నారు. చిన్నకల్వలలో మంగళవా రం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. చట్టాలపై ప్రజలకు అవగా హన కల్పిస్తున్నామని, ఉచిత న్యాయ సేవలు అందిస్తామని అన్నారు. పంచాయతీ కార్యదర్శి రణధీర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రీన్‌బెల్ట్ అభివృద్ధికి చర్యలు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ తెలంగా ణ యాష్‌పాండ్ సమీపంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత తెలిపారు. ప్లాంటులోని 33 ఎకరాల్లో 33 వేల రకాల మొ క్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం ఈడీ ప్రారంభించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎన్టీపీసీ కృషి చేస్తోందన్నారు. జీవవైవిధ్యాన్ని పెంపొందిండచమే లక్ష్యమన్నా రు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ సహకా రంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. జనరల్ మేనేజర్లు త్రిపాఠి, ముకుల్ రాయ్, సింఘా రాయ్, ఏజీఎం బిజయ్‌కుమార్ సిక్దర్, అధికారులు, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.
రెండు గ్రామాల్లో సదస్సులు
ఎలిగేడు: భూభారతి చట్టం ద్వారా భూసంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు పైలెట్ ప్రా జెక్టుగా ఎంపికచేసిన ఎలిగేడు మండలంలోని ఎలిగేడు, బుర్హాన్‌మియాపేటలో రెండోరోజు మంగళవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఎలిగేడులో 115, బుర్హాన్‌మియాపేటలో 60 దరఖాస్తులు అందాయని అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. తహషీల్దార్ బషీరొద్దీన్, కలెక్టరేట్ సూరింటెండెంట్ యక్కన్న, డెప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్‌ఐలు చంద్రశేఖర్, జయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలోనే అప్పులు
పాలకుర్తి(పెద్దపల్లి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరా వు అన్నారు. కుక్కలగూడూరులో మంగళవా రం నిర్వహించిన జైబాపు..జైభీమ్.. జైసంవి ధాన్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, నాయకులు జంగ రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిపై సీఎం శ్రద్ధ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారని హర్కర వేణుగోపాలరావు అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో స్థానిక నాయకులు రమేశ్‌గౌడ్, అనిల్, శ్రీనివాస్ తదితరులు ఆయనను కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం పెద్దపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంగా హామీ ఇచ్చిన ఆర్టీసీ బస్‌డిపో, బైపాస్‌రోడ్డు, జిల్లా కోర్టు, ప్రభుత్వ ఆస్పత్రి భవన ఆధునికీకరణ తదితర పనులు జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో సాగుతున్నాయని హర్కర తెలిపారు.
సమ్మెకు ఆశ వర్కర్లు సై
పెద్దపల్లిరూరల్: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెలో ఆశ వ ర్కర్లు పాల్గొంటారని ఆశ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి తెలిపారు. మంగళవారం మెడికల్ ఆఫీసర్‌కు వినతిపత్రం అదజేశారు. ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌక ర్యం కల్పించాలని ఆమె కోరారు. నాయకులు శోభారాణి, రేణుక, అనురాధ, కవిత, నిర్మల, సునీత తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి