
ప్రమాదాలను నియంత్రించాలి
● ప్రధాన కూడళ్లను ఆధునికీకరించాలి ● పకడ్బందీగా కార్యాచరణ చేపట్టాలి ● ట్రాఫిక్, పోలీసు అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ట్రాఫిక్, పోలీసు, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ అధికారులతో ఆయ న శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. డీసీపీ కరుణాకర్ హాజరయ్యారు. పెద్దపల్లిలోని ప్రధానమైన రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని, ఈ సమయాల్లో జంక్షన్ల వద్ద తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాల సమయాల్లో విద్యార్థులు రోడ్డు దాటే లా వాహనాలను నియంత్రించాలని సూచించా రు. ఇందుకోసం స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. చీకురాయి రోడ్డు, కమాన్, కూనారం క్రాస్‌రోడ్డు, ప్రగతినగర్, బస్టాండ్, మంథని ఫ్లైఓవర్ వద్ద రోడ్లు విస్తరించాలని అన్నారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మె ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏసీపీలు కృష్ణ, రమేశ్, సూ పరింటెండెంట్ ప్రకాశ్, ట్రాఫిక్, సీఐ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.