
సమస్యలు సత్వరం పరిష్కరించండి
● ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: ‘పెద్దపల్లి శివారు చందపల్లిలో ప్రభుత్వం కేటాయించిన వందగజాల స్థలంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందించాలని శాంతినగర్‌కు చెందిన రాజమణి కలెక్టర్‌ను వేడుకుంది..’ ఇలా.. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణుకు వినతులు అందించి పరిష్కారం చూపాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలపై స్వీకరించిన వినతులను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.