
బాగైన చేతిపంపు.. తీరిన నీటి కొరత
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రంలోని ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో ఉన్న చేతిపంపు పని చేయడం లేదని, ఆప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారని మార్చి 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదే రోజు ఎంపీడీవో జయశీల చేతిపంపును బాగు చేయించారు.
అధికారులు త్వరగా స్పందించారు
బోయినపల్లి ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో బోరు చేడిపోయింది. మా సమస్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, అధికారులు వెంటనే స్పందించారు. ఎంపీడీవో ఆదేశాలతో బోరుకు మరమ్మతు చేశారు. మా ఏరియా ప్రజలకు నీటి కొరత తీర్చిన ‘సాక్షి’కి సలాం. – మాడిచెట్టి శ్రీనివాస్, బోయినపల్లి

బాగైన చేతిపంపు.. తీరిన నీటి కొరత

బాగైన చేతిపంపు.. తీరిన నీటి కొరత